- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ @25.. సెలబ్రేషన్స్‌పై శ్రేణులకు కేటీఆర్ కీలక పిలుపు
BRS పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా సెలబ్రేషన్స్ పై కేటీఆర్ కీలక పిలుపునిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రేపటికి అంటే.. ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో.. సెలబ్రేషన్స్ పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతీ గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని సూచించారు. పార్టీ శ్రేణులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు.. తెలంగాణ భవన్లో రాష్ట్రస్థాయి ప్రతినిధుల సమావేశం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఆదేశాల మేరకు ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు సహా.. మాజీ ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లకు మాత్రమే ఆహ్వానం ఉందని స్పష్టం చేశారు.
ప్లీనరీ సమావేశానికి తెలంగాణ భవన్లో పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. కేవలం ఆహ్వానం ఉన్నవారు మాత్రమే హాజరుకావాలని, మిగిలిన వారంతా తమ నియోజకవర్గాల్లోనే వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కేటీఆర్ కోరారు. సుదూర ప్రాంతాల నుంచి ప్లీనరీ సమావేశానికి వచ్చేవారు.. మధ్యాహ్నం 1.30 గంటలకల్లా హైదరాబాద్ కు చేరుకోవాలని సూచించారు.
ఆ హామీలు, డిక్లరేషన్లు, గ్యారంటీలు ఏమయ్యాయి?
తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 సాధారణ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే, ప్రస్తుత పంచాయతీ ఎన్నికల వాతావరణంలో బీఆర్ఎస్ బలం గణనీయంగా పెరిగిందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ, స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో ప్రారంభమైన బీఆర్ఎస్ ప్రయాణం నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుని రజతోత్సవ దశకు చేరుకోవడం గర్వకారణమన్నారు.
కేసీఆర్ మళ్లీ సీఎం అవ్వడం ఖాయం
ఇదే సమయంలో కాంగ్రెస్ పనితీరుపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో తాము తీసుకొచ్చిన 'స్కైరూట్' వంటి ప్రతిష్టాత్మక కంపెనీలకు, ఇప్పుడున్న వారు కేవలం రిబ్బన్లు కట్ చేస్తూ తమ ఘనతగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు చేసే స్థాయి లేని వారు కూడా నేడు కేసీఆర్‌ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటి వరకూ రూ.3.70 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు స్వయంగా రేవంతే ఒప్పుకున్నారన్న కేటీఆర్.. ఢిల్లీకి మూటలు మోయడం తప్ప, రాష్ట్రానికి చేసిందేమీ లేదని యద్దేవా చేశారు. కేసీఆర్ ను మళ్లీ సీఎంను చేసి రాష్ట్రాన్ని పునర్మించుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అధికారంలోకి రాకుండా రకరకాల కుట్రలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో కొన్ని చిన్నపాటి తప్పిదాల వల్ల 11 స్థానాలను కోల్పోయామని కేటీఆర్ అంగీకరించారు. అయితే, అక్కడ గెలిచిన కాంగ్రెస్ నాయకులు ప్రజలకు చేసిందేమిటని ఆయన ప్రశ్నించారు. గెలిచినంత మాత్రాన అద్భుతాలు చేసినట్లు కాదని, ప్రజల పక్షాన నిలబడేది బీఆర్ఎస్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.






