అధ్యక్ష పదవి కోసం బావ, బామ్మర్ది కొట్లాట.. విప్ బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

బీఆర్ఎస్ (BRS) అధ్యక్ష పదవి కోసం బావ, బామ్మార్ది కొట్లాట మొదలైందని, మొదట కుటుంబ సమస్యలు పరిష్కరించుకుని తర్వాత ప్రజల సమస్యలపై మాట్లాడాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అధ్యక్ష పదవి కోసం బావ, బామ్మర్ది కొట్లాట.. విప్ బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) అధ్యక్ష పదవి కోసం బావ, బామ్మార్ది కొట్లాట మొదలైందని, మొదట కుటుంబ సమస్యలు పరిష్కరించుకుని తర్వాత ప్రజల సమస్యలపై మాట్లాడాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన రాహుల్ గాంధీ కుటుంబంపై కేటీఆర్ (KTR) అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. రాహుల్ గాంధీని ఉరి తీయాలని అనడం బలుపు మాటలని ఫైర్ అయ్యారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, అసెంబ్లీకి రాకుండా పారిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా కేసీఆర్ పని అయిపోయిందని.. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ అయ్యాయని అన్నారు.

ఇక పార్టీ అధ్యక్ష పదవి కోసం హరీష్ రావు (Haris Rao), కేటీఆర్ మధ్య పోటీ తారాస్థాయికి చేరిందని బీర్ల ఐలయ్య తెలిపారు. సోనియా గాంధీ దయతో కేసీఆర్ సీఎం అయ్యారని, ఆమె లేకపోతే కేటీఆర్ మంత్రి పదవి ఎక్కడిదని కామెంట్ చేశారు. ముందుగా చెల్లెలు కవిత చేసిన వ్యాఖ్యలు, హరీష్ రావుపై చేసిన ఆరోపణలపై కేటీఆర్‌కి సమాధానం చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, గాంధీ కుటుంబంపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీర్ల ఐలయ్య వార్నింగ్ ఇచ్చారు.

Next Story