Good News: తెలంగాణ విద్యార్థులకు బ్రిటన్ స్కాలర్ షిప్ లు.. సీఎంతో భేటీలో బ్రిటీష్ హైకమిషనర్

by Prasad Jukanti |

రేవంత్ రెడ్డితో బ్రిటీష్ హైకమిషనర్ లిండీ కామెరాన్‌ భేటీ అయ్యారు.

Good News: తెలంగాణ విద్యార్థులకు బ్రిటన్ స్కాలర్ షిప్ లు.. సీఎంతో భేటీలో బ్రిటీష్ హైకమిషనర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యా, సాంకేతిక రంగాల్లో తెలంగాణకు మరింత సహకారం అందించడంతో పాటు రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇచ్చేందుకు భారత్ లో బ్రిటన్ హైకమిషనర్ లిండీ కామరూన్ (British High Commissioner Lindy Cameron) అంగీకరించారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) బ్రిటన్ హైకమిషనర్ లిండీ కామరూన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ (Deputy High Commissioner Gareth Wynn Owen) సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ వర్సిటీల్లో చదివే తెలంగాణ విద్యార్థుల గురించి ముఖ్యమంత్రి వీరితో చర్చించారు.

రాష్ట్రంలో తీసుకురాబోతున్న నూతన విద్యా విధానం డ్రాఫ్ట్ ను వీరికి సీఎం వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు బ్రిటిష్ హై కమిషనర్ సుముఖత వ్యక్తం చేశారు. యూకేలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం యూకే యూనివర్సిటీలు హైదరాబాద్ లో కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలని సీఎం కోరారు. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటి,న్ కంపెనీలు భాగస్వాములు కావాలని, బీసీసీ, ఫార్మా, నాలెడ్జ్, అకాడమీలో పెట్టుబడులకు ముందుకు రావాలని ఆహ్వానించారు. సీఎం విజ్ఞప్తులపై బ్రిటిషన్ హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ- యూకే మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సహకరించేందుకు హామీ ఇచ్చారు.

Next Story