శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బ్రిటీష్ ఎయిర్ వేస్ నిలిపివేత.. రెండు గంటలుగా రన్‌వే పైనే!

by Ramesh Naini |

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం నిలిచిపోయింది.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బ్రిటీష్ ఎయిర్ వేస్ నిలిపివేత.. రెండు గంటలుగా రన్‌వే పైనే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: (US strike on Iran) ఇరాన్ పై అమెరికా మెరుపు దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని (Shamshabad airport) శంషాబాద్ ఎయిర్‌పోర్టులో (British Airways) బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం నిలిచిపోయింది. ఇవాళ హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోనే నలిపివేశారు. దీంతో రెండు గంటలుగా టేకాఫ్ తీసుకోకుండా రన్ వే పైనే విమానం ఉండిపోయింది. యుద్ధం కారణంగా ఇంకా అనుమతి రాలేదని అధికారులు పేర్కొన్నారు. ఇక, విమానం టేకాఫ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ మేరకు విమానంలో ఉన్న ప్రయాణికుడు సెల్ఫీ వీడియో తీస్తూ వివరాలు పంచుకున్నారు.

రెండు గంటలుగా లండన్ వెళ్తున్న బ్రిటీష్ ఎయిర్ వేస్ రెండు గంటలుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని రన్ వేపైనే నిలిపివేశారని, రూట్ క్లియరెన్స్ రాలేదని సిబ్బంది చెబుతున్నారని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఓ వ్యక్తి వీడియో షేర్ చేశారు. ఈ మేరకు విమానంలో ప్రయాణికులు అయోమయంలో ఉన్న దృశ్యాలను షేర్ చేశారు. కాగా, ఇరాన్, ఇజ్రాయిల్‌ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఇరాన్ (Iran Nuclear Sites) అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించినట్లు స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో అటు వైపు వెళ్లే చాలా విమాన సర్వీస్‌లు నిలిపివేసినట్లు తెలుస్తోంది.

Next Story