- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుజరాత్లో కూలిన వంతెన.. బీజేపీకి కౌంటర్ ఇస్తూ KTR సెటైరికల్ ట్వీట్
గుజరాత్ (Gujrat) రాష్ట్రం పద్రా (Padra)లోని మహిసాగర్ నది (Mahi Sagar River)పై వడోదర-ఆనంద్ పట్టణాలను కలుపుతూ నిర్మించిన గంభీర-ముజ్పూర్ వంతెన ఇవాళ ఉదయం ఒక్కసారిగా కూలిపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ (Gujrat) రాష్ట్రం పద్రా (Padra)లోని మహిసాగర్ నది (Mahi Sagar River)పై వడోదర-ఆనంద్ పట్టణాలను కలుపుతూ నిర్మించిన గంభీర-ముజ్పూర్ వంతెన ఇవాళ ఉదయం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో బ్రిడ్జిపై వెళ్తున్న ఓ ట్రక్కు, బొలెరోతో పాటు మరో రెండు వాహనాలు నదిలో పడిపోయాయి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఈ క్రమంలోనే గంభీర బ్రిడ్జి కూలిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని (BJP Government)ను ఉద్దేశించి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. మోర్బీ బ్రిడ్జి కూలిపోయి 140 మందికి పైగా మరణించిన ఘటన దేశం మరువక ముందే తాజాగా గంభీర బ్రిడ్జి కూలడం మరింత షాకింగ్‌గా ఉందని అన్నారు. గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్‌లలో వరుసగా కూలుతోన్న వంతెనలపై NDSA లేదా ఇతర బ్రిడ్జి సేఫ్టీ ఏజెన్సీలు విచారణ జరపాలని ఆశిస్తున్నామని కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా గంభీర బ్రిడ్జి కూలిన ఘటనలో క్షతగాత్రులైన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే, మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో గంటల వ్యవధిలోనే ఎన్డీఎస్ఏ రిపోర్టును ఇవ్వడాన్ని గతంలో కేటీఆర్ తప్పుబట్టిన విషయం తెలిసిందే.






