- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్ కారిడార్‌లో టెన్షన్.. టెన్షన్, కొనసాగుతున్న ‘ఆపరేషన్ గజ’
కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్ కారిడార్‌లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్ కారిడార్‌లో సులుగుపల్లి వద్ద ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ మేరకు వాటిని సరిహద్దులు దాటించేందుకు అధికారులు ‘ఆపరేషన్ గజ’ పేరుతో ఇప్పటికే ఆరు బృందాలు రంగంలోకి దింపారు. ఇందులో భాగంగా థర్మల్ డ్రోన్ కెమెరాలతో అటవీ శాఖ అధికారులు ఏనుగుల కోసం జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే గత అర్ధరాత్రి అడవిని వదిలి ఓ ఏనుగు రోడ్డుపైకి వచ్చి హల్‌చల్ చేసింది. అనంతరం ఉదయం 5 గంటల ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన థర్మల్ డ్రోన్ కెమెరా కంటికి ఏనుగు చిక్కింది. అయితే, ఏనుగుల దాడిలో ఇప్పటికే ఇద్దరు రైతులు ప్రాణాలు విడిచారు. ఆహారం కోసం ఎకరం వరి పొలాన్ని ఓ ఏనుగు నాశనం చేసింది. ప్రస్తుతం అదే గజరాజు పెంచికల్ మండల పరిధిలోని కమ్మర్‌గాం గ్రామం వైపు పయనిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సమీప గ్రామాల ప్రజలను అలర్ట్ చేస్తున్నారు.






