- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING : వీడిన మీర్‌పేట్ బాలుడి మిస్సింగ్ కేసు మిస్టరీ
హైదరాబాద్ మీర్‌పేట్‌లో మిస్ అయిన బాలుడి మిస్టరీ వీడింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మీర్‌పేట్‌లో మిస్ అయిన బాలుడి మిస్టరీ వీడింది. మిస్ అయిన బాలుడు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడిని తిరుపతిలో పోలీసులు గుర్తించారు. బాలుడి ఆచూకీ తెలియడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన తిరుపతి బయల్దేరి వెళ్లారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా బాలుడి ఆచూకీ లభ్యమైంది. ఈ నెల 4న సాయంత్రం నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు. అయితే ట్యూషన్‌కు వెళ్లిన 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు మహీధర్ రెడ్డి ఇంటికి తిరిగి రాలేదు.
అయితే సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా ఓ టూ వీలర్ మీద వెళ్తున్నట్లు దృశ్యాలు నమోదయ్యాయి. అనంతరం మలక్ పేట్ రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద ప్రత్యక్షమయ్యాడు. అక్కడ టికెట్ తీసుకున్నట్లు దృశ్యాలు నమోదయ్యాయి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడనే కోణంలో పోలీసులు గాలింపు చేపట్టారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు 4 బృందాలతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయితే తిరుపతిలో బాలుడి ఆచూకీ లభ్యమవడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.






