- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో తలెత్తిన సాంకేతిక లోపం.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
సికింద్రాబాద్ నుంచి కాగజ్‌నగర్‌కు వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది.

X
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ నుంచి కాగజ్‌నగర్‌కు వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ట్రైన్ వరంగల్ జిల్లా పరిధిలోని హాసన్‌పర్తి వద్ద నిలిచిపోయింది. మార్గమధ్యలో ట్రైన్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులు, కాలేజీలు, పరీక్షలు రాసేందుకు వెళ్తున్న వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా అదే రూట్లో వెళ్లే పలు రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లోకో పైలెట్ సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే టెక్నీషియన్లు సాంకేతిక లోపం తలెత్తిన ఇంజిన్‌ను పరిశీలించారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆ ఇంజిన్ స్థానంలో మరో ఇంజిన్‌ను అమర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story






