- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: మంచిర్యాల జిల్లాలో అమానవీయ ఘటన.. వీధి కుక్కల దాడిలో నవజాత శిశువు మృతి

X
దిశ, వెబ్‌డెస్క్: మానవత్వానికే మచ్చతెచ్చిన అమానవీయ ఘటన మంచిర్యాల జిల్లాలో ఇవాళ చోటుచేసుకుంది. భీమిని మండల పరిధిలోని కేస్లాపూర్ గ్రామంలో నిన్న రాత్రి 8 నెలల వయసు గల నవజాత శిశువును గుర్తు తెలియని మహిళ గ్రామ శివారులోని చేనులో వదిలేసి వెళ్లింది. ఈ క్రమంలోనే అక్కడ జన సంచారం లేకపోవడంతో వీధి కుక్కలు చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేశాయి. ఈ ప్రమాదంలో నవజాత శిశువు అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని చేనులో వదిలి వెళ్లిన నిందితురాలు గంగను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story






