బ్రేకింగ్ : ఏపీ మంత్రులపై మరోసారి హరీష్ రావు ఫైర్

by Disha Web Desk 4 |
బ్రేకింగ్ : ఏపీ మంత్రులపై మరోసారి హరీష్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రులపై మరోసారి మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మీకు చేతనైతే ప్రత్యేక హోదా కోసం పోరాడండని చురకులు అంటించారు. నేను ఏపీ ప్రజల్ని తిట్టింది లేదు.. ఏం చేసింది లేదన్నారు. అయినా కొంత మంది నాయకులు నాపై ఎగిరి ఎగిరి పడుతున్నారని మండిపడ్డారు. నేను ఏపీ ప్రజల పక్షాన మాట్లాడానన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి మా కాళేశ్వరంలా నీళ్లు తెచ్చి మాట్లాడండన్నారు. విశాఖ ఉక్కు కోసం పోరాడాని హితవు పలికారు. మా తెలంగాణ ఎంత గొప్పగా ఉందో పక్క రాష్ట్రాలతో పోల్చి చెప్పానన్నారు.

Read More: పవన్ కల్యాణ్‌‌కు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్

Next Story

Most Viewed