- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ : తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్
తెలంగాణ స్పీకర్‌గా వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్పీకర్‌గా వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో టెక్స్ టైల్ మంత్రిగా ప్రసాద్ కుమార్ పని చేశారు. తాజాగా కాంగ్రెస్ నిర్ణయంతో దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్‌కు స్పీకర్ పదవిని కట్టబెట్టినట్లయింది. కొత్త అసెంబ్లీ కొలువు దీరిన తర్వాత ఎమ్మెల్యేలందరి చేత ప్రొటెమ్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం వారంతా కలిసి స్పీకర్ గా ఒకరిని ఎన్నుకోనున్నారు. ఇప్పటికే గడ్డం ప్రసాద్ పేరును స్పీకర్ పోస్ట్ కోసం కాంగ్రెస్ పరిశీలించి సూచన ప్రాయంగా ఖరారు చేసిన నేపథ్యంలో ఇక ఎమ్మెల్యేలు ఆయనను ఎన్నుకోవడం లాంఛనప్రాయమే కానుంది.
Next Story






