బ్రేకింగ్ : డ్రగ్స్ కేసులో MLA Rohit Reddy ఈడీ నోటీసులు

by Sathputhe Rajesh |   (  Updated:2022-12-16 09:23:19  IST  )

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా వ్యవరించిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది.

బ్రేకింగ్ : డ్రగ్స్ కేసులో MLA Rohit Reddy ఈడీ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా వ్యవరించిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈనెల 19న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో తెలిపింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డిపై అనుమానాలున్న నేపథ్యంలో ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో ఉన్న సమయంలో ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. గతంలో బెంగళూరు పోలీసుల ముందు విచారణకు రోహిత్ రెడ్డి హాజరయ్యారు. కాగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పైలెట్ రోహిత్ రెడ్డిపై మళ్లీ డ్రగ్స్ కేసు విచారణ చేయిస్తామని పలు సందర్భాల్లో అన్నారు. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై స్పందించిన రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరవుతానని తెలిపాడు.

Also Read..

సీఎం మీడియా సమావేశం సీడీలు ఎక్కడివి?

Next Story