BREAKING: కాసేపట్లో కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.. బరిలో 15 మంది అభ్యర్థులు

by Kema Shiva Kumar |   (  Updated:2024-06-04 02:27:34  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఫీవర్ పట్టుకుంది.

BREAKING: కాసేపట్లో కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.. బరిలో 15 మంది అభ్యర్థులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఫీవర్ పట్టుకుంది. అయితే, ఆ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ నియోజవర్గానికి కూడా ఉప ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో ఆకస్మాత్తుగా మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో ఎలక్షన్ కమీషన్ లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ స్థానానికి కూడా ఉప ఎన్నికను నిర్వహించింది. ఈ క్రమంలోనే నియోజవర్గ వ్యాప్తంగా మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందులో బీఆర్ఎస్ నుంచి లాస్య నందిత సోదరి నివేదిత, అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ గణేష్, బీజేపీ నుంచి టీఎన్ వంశీ తిలక్ పోటీలో ఉన్నారు. కాసేపటి క్రితమే కంటోన్మెంట్‌ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

Next Story