- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: బీజేపీ కొత్త నాటకాలు ఆడుతోంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిస్తే దేశ ప్రజలు స్వేచ్ఛను కోల్పోతారని మంత్రి ఉత్తమ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిస్తే దేశ ప్రజలు స్వేచ్ఛను కోల్పోతారని మంత్రి ఉత్తమ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు తమకు పోటీయే కాదని తెలిపారు. రాష్ట్రంలో ఆ పార్టీని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అన్నారు. ఒకవేళ బీజేపీ మళ్లీ గెలిస్తే.. ప్రజాస్వామ్య వ్యవస్థకు బీజేపీ ప్రమాదకరంగా మారిందని తెలిపారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ విషయంలో కట్టుబడి ఉందని, దానిపై బీజేపీ రాజకీయం చేస్తూ నాటకాలు ఆడుతోందని, వారి మాటలను ఎవరూ విశ్వసించరని అన్నారు. రాజకీయంగా కారు పార్టీ ఇప్పటికే కుదేలైందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో టీంగా పని చేస్తోందని తెలిపారు. అదేవిధంగా పీడీఎస్ బియ్యంలో అక్రమాలకు పాల్పడితే శిక్ష తప్పదని పేర్కొన్నారు.
Next Story






