- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనవరి నుంచి అంగన్వాడీల్లో బ్రేక్ ఫాస్ట్
by Muthe.Rajitha |
అంగన్వాడీ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

X
దిశ, వెబ్ డెస్క్ : అంగన్వాడీ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2026 జనవరి మొదటివారం నుంచే అంగన్వాడీల్లో బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించనుంది ప్రభుత్వం. ముందుగా ఈ పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ లో ఈ పథకాన్ని మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. అది విజయవంతం అయితే అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు. టీజీ ఫుడ్స్ ద్వారా రెడీ టు ఈట్ పద్దతిలో ఆహారాన్ని అందించనున్నారు. ఒకరోజు కిచిడీ, మరోరోజు ఉప్మా విద్యార్థులకు ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 35,781 అంగన్వాడీ కేంద్రాల్లోని 8 లక్షల మంది చిన్నారుల ఆకలి తీర్చనుంది ప్రభుత్వం. కాగా ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
Next Story






