- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T Congress: ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులకు నిరాశ... ఆ నియామకాలకు బ్రేక్?
కాంగ్రెస్ పార్టీలో పదవుల విషయంలో ఎదురు చూస్తున్న నాయకులకు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ తీవ్ర నిరాశ నిపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం అనుసరించాల్సిన తీరుపై లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ (Congress) పార్టీ శ్రేణుల్లో మాత్రం ఓ విషయంలో నిరాశ కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)ల (DCC appointments) నియామకం మరికొంత కాలం బ్రేక్ పడనున్నట్లు తెలుస్తోంది. ఈ నియామకాల ప్రక్రియ దాదాపు కొల్కికి వచ్చిందని అనుకునే లోపు నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ పోస్టుల భర్తి విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోదనే చర్చ వినిపిస్తోంది. దీంతో ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులకు ఎదురు చూపులు తప్పేలా లేవు.
పాత డీసీసీలతోనే ఎన్నికలకు:
తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ విషయంలో ఇప్పటికే వివిధ కోణాల్లో సరత్తు చేసిన పార్టీ అధిష్టానం ఇటీవలే 22 మంది పరిశీలకులను నియమించింది. వారితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) తదితరులు గత వారం ఢిల్లీలో భేటీ అయ్యారు. దసరా పడం తర్వాత అక్టోబర్ 4 నుంచి క్షేత్ర స్థాయిలో ఈ పరిశీలకులు పర్యటించి సమర్థవంతమైన నాయకులను అధిష్టానానికి సిఫార్సు చేయబోతున్నట్లు పీసీసీ చీఫ్ వెల్లడించారు. కానీ ఇంతలో స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ షెడ్యూల్ అనౌన్స్ కావడంతో ఈ విషయంలో మరికొంత కాలం వేచిచూసే ధోరణలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్ పాత జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలోనే స్థానిక ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పడం ఇందుకు నిదర్శనం అనే చర్చ జరుగుతోంది.






