BR Naidu: సోషల్ మీడియాలో టీటీడీ చైర్మన్ వీడియో వైరల్.. స్పందించిన బీఆర్ నాయుడు

by Prasad Jukanti |   (  Updated:2026-03-01 06:09:35  IST  )

తనపై డీప్‍ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మండిపడ్డారు. దీని వెనుక వైసీపీ కుట్ర ఉందని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

BR Naidu: సోషల్ మీడియాలో టీటీడీ చైర్మన్ వీడియో వైరల్.. స్పందించిన బీఆర్ నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నకిలీ డీప్‍ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) అన్నారు. వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్టపాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. ఓ మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్నట్లుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. ఈ వీడియోలను వైసీపీ మద్దతు దారులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ ప్రచారంపై ఇవాళ ఫేస్ బుక్‍లో బీఆర్ నాయుడు.. AI సాంకేతికతను వాడుకుని నా రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ఖండించారు.

వైసీపీపై ఆరోపణలు:

ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనది, వక్రీకరించిందన్నారు. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకం అని అన్నారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని వైసీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై నేను చట్ట ప్రకారం ముందుకెళ్తానని స్పష్టం చేశారు. నాపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్ర‍ను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశానని నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదని హెచ్చరించారు.

Next Story