KA. Paul : ప్యాకేజీ స్టార్లను బహిష్కరించండి: కే.ఏ. పాల్

by Y. Venkata Narasimha Reddy |

మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi), పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కుటుంబం మాటలు విని ప్రజలు మోసపోవద్ధని ప్యాకేజీ స్టార్లను బహిష్కరించండని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్(KA. Paul)పిలుపునిచ్చారు.

KA. Paul : ప్యాకేజీ స్టార్లను బహిష్కరించండి: కే.ఏ. పాల్
X

దిశ, వెబ్ డెస్క్ : మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi), పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కుటుంబం మాటలు విని ప్రజలు మోసపోవద్ధని ప్యాకేజీ స్టార్లను బహిష్కరించండని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్(KA. Paul)పిలుపునిచ్చారు. గతంలో నేను అమెరికాలో ఉన్నానని...ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నానని..నేను కాపును కాదా...కాపులను కాపాడే పెద్ద కాపును కాదా అని పాల్ చెప్పుకొచ్చారు. మెగా బ్రదర్స్ మాటలు నమ్మితే మెంటల్ అయిపోతారని..కేబినెట్ మీటింగ్ కు హాజరకాకుండా పవన్ కళ్యాణ్ పిచ్చి పట్టి ఆలయాల చుట్టు తిరుగుతున్నారని పాల్ విమర్శించారు.

ప్రజలు వారి గురించి కాకుండా మేఘా ఇంజనీరింగ్ సంస్థ కృష్ణారెడ్డి్కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 10వేల కోట్ల డీల్ ఎందుకు ఇచ్చాడని..పోలవరం 80వేల కోట్ల కాంట్రాక్టు ఎందుకు ఇవ్వబోతున్నాడో మాట్లాడాలని సూచించారు. మేఘా కృష్ణారెడ్డి భార్య రాజ్యసభ సభ్యురాలు కావడానికి 500కోట్లు బీజేపీకి ఇవ్వనుందని, ఆమె బీజేపీలో చేరబోతుందని ఆరోపించారు. రాజకీయ పార్టీలకు కోట్ల అవినీతి సొమ్ము లక్షల కోట్లను రాజకీయ పార్టీలకు వేలకోట్లు విరాళంగా మేఘా కృష్ణారెడ్డి విరాళంగా అందిస్తున్నాడని రుజువులు నేను పెట్టానని.. కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా సంస్థ చేసిన అవినీతిపైన నేను హైకోర్టులో కొట్లాడుతున్నానని..న్యాయం జరిగే వరకు కొట్లాడుతానని చెప్పుకొచ్చారు.

అలాగే తనకు వారసుడి కోసం మనవడు పుట్టాలని పద్శభూషణ్ చిరంజీవి మాట్లాడటం సరికాదని..దీనిపై ఆయన క్షమాపణ చెప్పాలని పాల్ డిమాండ్ చేశారు. ఇందిరాగాంధీ వంటి వారు ప్రధానిగా రాణించారని..చిరంజీవి వారసత్వపు మాటలు మహిళల పట్ల వివక్షతను చాటేలా ఉన్నాయని పాల్ మండిపడ్డారు.

అంతకుముందు తాను ఇకనుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానన్న చిరంజీవి వ్యాఖ్యలపై కే.ఏ పాల్ స్పందించారు. 70 ఏళ్ల వయసున్న చిరంజీవి మతి తప్పిందా? లేక కొత్త వేషమా అని అన్నారు. ప్రజా రాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందన్న చిరంజీవి.. పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారని మండిపడ్డారు. పవన్, చిరంజీవి బీజేపీలో చేరుతారని తాను ఎప్పుడో చెప్పానన్నారు. పవన్ కళ్యాణ్ డ్రామాలో చంద్రబాబు మోసపోయారని పేర్కొన్నారు. పవన్‌ని నమ్మి చంద్రబాబు తన కొడుకుకే అన్యాయం చేస్తున్నారని పాల్ వ్యాఖ్యానించారు. మెగా ఫ్యామిలీకి ఓటు బ్యాంక్ లేదన్న వాస్తవం మీకు తెలియదా అని చంద్రబాబును ప్రశ్నించారు. కోర్టులు, జడ్జీలను వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో తన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని.. వాటిని సరైన టైంలో బయటపెడతానని తెలిపారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ డ్రామాని సీరియస్‌గా తీసుకోకండని పేర్కొన్నారు. మెగా బ్రదర్స్ పదవుల విషయంలో డీల్ కుదరక ఈ డ్రామాలు ఆడుతున్నారన్నారు.

పవన్ కల్యాణ్ సనాతన ధర్మం టూర్ చేసే ముందు.. నీ భార్య కన్నీళ్లు పెడుతుంది గుర్తు చేసుకో అని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ వదిలెయ్యక ముందే.. చంద్రబాబు తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. హామీలు అమలు చేయకుండా చంద్రబాబు చేతులెత్తేస్తాడని, రేవంత్ రెడ్డి మోసగాడని తనకు ఎప్పుడో తెలుసన్నారు. అమెరికాలో తెలుగు విద్యార్థుల కోసం 72 గంటల పాటు ఆమరణ దీక్ష చెయ్యాలని నిర్ణయించుకున్నానని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎలా ఆమరణ దీక్ష చేసి గెలిచానో అమెరికాలో తెలుగు విద్యార్థుల కోసం అలాగే దీక్ష చేస్తానన్నారు. అల్లు అర్జున్‌ని జైలుకు పంపింది వీళ్ళేనని.. ఆయన్ని కూడా బీజేపీలో చేర్చాలని ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోలేదని.. తాను ఫలితాలపై సుప్రీం కోర్టులో కేసు వేస్తున్నానని అన్నారు. దమ్ముంటే ఈవీఎం ఎన్నికలు కాకుండా బ్యాలెట్ ఎలెక్షన్స్ పెట్టండని పాల్ బీజేపీకి సవాల్ విసిరారు.

Next Story