TG: పంచాయతీ ఎన్నికలు బహిష్కరణ

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-29 11:28:32  IST  )

పంచాయతీ ఎన్నికలు బహిష్కరణ

TG: పంచాయతీ ఎన్నికలు బహిష్కరణ
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి(Kamareddy) జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపల్లి(Mallupalli)లో గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలు బహిష్కరించారు. గ్రామ సమస్యలతో పాటు జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో విసుగు చెంది పంచాయతీ ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 11వ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్, వార్డు సభ్యులు నామినేషన్ వేయకుండా పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అధికారులు శనివారం మధ్యాహ్నం గ్రామానికి వచ్చారు. గ్రామస్తులతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తొలి విడతకు సంబంధించి ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. 30న వీటి పరిశీలన ఉంటుంది. డిసెంబర్‌ 3 వరకు ఉపసంహరణ గడువు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. డిసెంబర్‌ 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచి ఫలితాలు వెల్లడిస్తారు.

Next Story