- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ లా సెట్ టాపర్… బోథ్ గ్రామానికి గర్వకారణం!
లా సెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫలితాలలో బోథ్ గ్రామానికి చెందిన ఎల్కూచి రుతిక రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించి ప్రభంజనం సృష్టించింది.

X
దిశ, బోథ్ : తెలంగాణ లా సెట్ ప్రవేశ పరీక్ష కు సంబంధించిన ఫలితాలు బుధవారం వెలుపడ్డాయి. అయితే లా సెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫలితాలలో బోథ్ గ్రామానికి చెందిన ఎల్కూచి రుతిక రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించి ప్రభంజనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే బోథ్ గ్రామానికి చెందిన ఎల్కూచి రాజశేఖర్ కూతురు అయిన ఎల్కూచి రుతిక లా సెట్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో 120 మార్కులకు గాను 85 మార్కులు సాధించి రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ రావడం పట్ల చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా మొదటి ర్యాంకు సాధించిన రుతిక కు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






