- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KRMB : రెండు రాష్ట్రాలు తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలి : కేఆర్ఎంబీ
తెలంగాణ(Telangana), ఏపీ(AP) రాష్ట్రాలు మొదట తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది కేఆర్ఎంబీ(KRMB).

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana), ఏపీ(AP) రాష్ట్రాలు మొదట తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది కేఆర్ఎంబీ(KRMB). రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పంటలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నీటిని వాడుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు(KRMB) తెలిపింది. గురువారం హైదరాబాద్ లోని జలసౌధలో జరిగిన సమావేశంలో కేఆర్ఎంబీ ఛైర్మన్ అతుల్ జైన్(Atul Jain) నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా(Rahul Bojja), ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్(Sai Prasad), ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.
ప్రస్తుతం శ్రీశైలం(Srishailam), నాగార్జునసాగర్(Nagarjunasagar) లో ఉన్న నీటిపై చర్చ జరగగా.. తమకు 63 టీఎంసీలు కావాలని తెలంగాణ, 55 టీఎంసీలు కావాలని ఏపీ కేఆర్ఎంబీకి రెండు రాష్ట్రాలు వివరాలు సమర్పించాయి. ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని బోర్డు సూచించింది. తాగు నీటికి ప్రాధాన్యం ఇస్తూ.. మిగిలినది పంటలకు వాడుకోవాలని తెలిపింది. 15 రోజులకు ఒకసారి నీటి మట్టం పరిస్థితులను సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లాలని రెండు రాష్ట్రాలకు బోర్డు సూచించింది.






