- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Boora Narsaiah Goud: కాంగ్రెస్ ప్రభుత్వం శాంపిల్ గవర్నమెంట్.. బూరనర్సయ్య గౌడ్ సెటైర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బూరనర్సయ్య గౌడ్ సెటైర్

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ (Boora Narsaiah Goud) విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓ శాంపిల్ గవర్నమెంట్ (Sample Government) అంటూ సెటైర్ వేశారు. ఈ ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా శాంపిల్స్ మాత్రమే ఉంటోందని దుయ్యబట్టారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లోకి టకీ టకీమని పడతాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారు. కానీ ఇప్పటి వరకు టికీ లేదు పిక్కి లేదు అని ఎద్దేవా చేశారు. రైతు భరోసా, రుణమాఫీ, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఏది ఇచ్చినా కేవలం శాంపిల్స్ మాత్రమే ఇస్తోందని విమర్శించారు. ఏ ప్రభుత్వమైనా సాధారణంగా నాలుగేళ్లకు విఫలం అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఏడాదిలోపే అన్ని రంగాల్లో విఫలం అయిందని దీన్ని డైవర్ట్ చేసేందుకే సెంటిమెంట్ అంశాలు తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శించారు. మీడియా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును గమనించాలన్నారు. ఈ రోజు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోవడమే కాకుండా ఆ పార్టీలో ఎవరికీ డిపాజిట్లు కూడా దక్కవన్నారు.






