- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రాజగోపాల్ రెడ్డిని చూస్తే జాలిగా ఉంది’.. మాజీ ఎంపీ బూర ఘాటు వ్యాఖ్యలు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy)పై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్(Boora Narsaiah Goud) తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy)పై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్(Boora Narsaiah Goud) తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గౌరవం లేని చోట రాజగోపాల్ రెడ్డి ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి తీరు చూస్తుంటే జాలిగా ఉందని ఎద్దేవా చేశారు. పదే పదే అడుక్కోవడం బాగోలేదని సూచించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన సత్తా ఏంటో చూపించాలని సవాల్ చేశారు. కాగా, ఇటీవల కాంగ్రెస్ అధిష్టానంపై తరచూ రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్‌లోకి వచ్చా అని.. జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని తెలిపారు. తనకు మంత్రిపదవి ఇస్తారా.. లేదా అనేది కాంగ్రెస్ పార్టీ ఇష్టమని, అందరిలాగా.. పదవుల కోసం కాళ్లు పట్టుకునే నైజం తనది కాదని స్పష్టం చేశారు. ఇకపై తాను ఎంత దూరమైనా వెళ్తానని తేల్చి చెప్పారు. మనసు చంపుకుని బతకడం తన వల్ల కాదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై బూర నర్సయ్య గౌడ్ స్పందించి విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.






