- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao : రేవంత్ సర్కార్.. బోనస్ బోగస్.. హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో ఫోటోను పోస్ట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: లారీల కొరత కారణంగా కాంటా వేయకపోవడంతో, నల్గొండ జిల్లా కట్టంగూర్ ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని రైతులు మిల్లర్లలో అమ్ముకునేందుకు తిరిగి తీసుకెళ్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు Harish Rao స్పందిచారు. శుక్రవారం x ఎక్స్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీల ఫోటోను పోస్ట్ చేశారు.
లాభసాటి వ్యవసాయమని, అన్ని పంటలకు బోనస్ అని, హామీ ఇచ్చి రైతులను నట్టేట ముంచింది congress కాంగ్రెస్ పార్టీ అని హరీశ్ రావు ఆరోపించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకోలేని దుస్థితికి రైతును దిగజార్చిన రేవంత్ సర్కార్.. బోనస్ బోగస్ అయ్యిందన్నారు. కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొని రైతులను ఆదుకోవాలి అని, రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.






