తెలంగాణ సంసృతికి ప్రతీక బోనాలు : ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-13 12:19:52  IST  )

తెలంగాణ సంస్కృతికి ప్రతిక బోనాల పండుగ అని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ (MLA Tigulla Padmarao goud) అన్నారు.

తెలంగాణ సంసృతికి ప్రతీక బోనాలు : ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సంస్కృతికి ప్రతిక బోనాల పండుగ అని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ (MLA Tigulla Padmarao goud) అన్నారు. మోండా మార్కెట్‌లోని టకార బస్తీలో ఆదివారం నిర్వహించిన బోనాలు వేడుకల్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేందుకు సంప్రదాయాలను గౌరవించాలన్నారు. తమ ప్రభుత్వ హయంలోనే బోనాలు వేడుకలకు ప్రాముఖ్యత పెరిగిందని పద్మారావు గౌడ్ అన్నారు. ప్రజలందరూ ఆనందంగా బోనాలు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆయన కుమారులు తీగుల్ల కిషోర్ కుమార్ గౌడ్, కిరణ్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్, పాల్గొన్నారు. అలాగే, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ఎంఎల్ సీ డాక్టర్ దాసోజు శ్రవణ్, కార్పొరేటర్లు హేమ, ప్రసన్న లక్ష్మి , శైలజ, సునీత తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Next Story