- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bonalu: బోనాల సందడి షురూ.. బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత, ఎంపీ ఈటల
హైదరాబాద్ నగరంలో బోనాల (Bonalu) సందడి షురూ అయింది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం నాడు బోనాల ఉత్సవాలు ప్రారంభిస్తారనే విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో బోనాల (Bonalu) సందడి షురూ అయింది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం నాడు బోనాల ఉత్సవాలు ప్రారంభిస్తారనే విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే నేడు గోల్కొండ జగదాంబిక ఆలయం నుంచి బోనాల సంబరాలు మొదలయ్యాయి. ఆడపడుచులు బోనాలను అమ్మవారికి సమర్పించి.. తమను సల్లంగా చూడమని వేడుకుంటున్నారు. ఇందులో భాగంగానే గోల్కొండ జగదాంబిక అమ్మవారు, ఎల్లమ్మ తల్లికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
అదేవిధంగా ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) కూడా గోల్కొండ జగదాంబిక ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యావత్ ప్రజానికానికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించే భాగ్యం కలగాలని.. జాతరను అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు. కాగా, నెల రోజుల పాటు హైదరాబాద్ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. జులై 13వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో బోనాలు ప్రారంభం కానున్నాయి.






