- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bonalu at Secretariat: తెలంగాణ సచివాలయంలో బోనాల వేడుకలు.. బోనమెత్తిన మంత్రి, సీఎస్
ఆషాడ బోనాల పండుగతో జంటనగరాలు గత కొన్ని రోజుల నుంచి కోలాహలంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆషాడ బోనాల పండుగతో జంటనగరాలు గత కొన్ని రోజుల నుంచి కోలాహలంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సచివాలయంలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నల్ల పోచమ్మ అమ్మవారికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారి బోనం సమర్పించారు. సచివాలయంలోని నల్ల పోచమ్మ దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బోనాల పండుగలో సచివాలయంలోని అధికారుల స్థాయి నుంచి అన్ని స్థాయిల సిబ్బంది అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పు విన్యాసాలు, పోతరాజుల ప్రదర్శనల మధ్య పెద్ద ఎత్తున నిర్వహించిన ఊరేగింపులో పలు కళారూపాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. వీరితో పాటు, నగరంలోని పలు పాఠశాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Next Story






