- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజాభవన్‌లో బోనాలు.. నల్లపోచమ్మ ఉత్సవాల్లో సీఎం, డిప్యూటీ సీఎం సందడి
by Ramesh Naini |
ఆషాడ మాసం సందర్భంగా నగరంలో బోనాల సందడి నెలకొంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజాభవన్‌లోని నల్ల పోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆషాడ మాసం సందర్భంగా నగరంలో బోనాల సందడి నెలకొంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజాభవన్‌లోని నల్ల పోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి సీఎం రేవంత్, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోనం సమర్పించుకున్నారు. ఆ తర్వాత ప్రజాభవన్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అబ్దుల్లాపూర్ మెట్‌కు బయలుదేరారు. గీత కార్మికులకు కాటమయ్య రక్ష పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించారు.
Next Story






