Bonala Special: అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన హీరోయిన్

by Gantepaka Srikanth |

హైదరాబాద్ మహా నగర వ్యాప్తంగా బోనాల పండుగ వైభవంగా సాగుతోంది.

Bonala Special: అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహా నగర వ్యాప్తంగా బోనాల పండుగ వైభవంగా సాగుతోంది. భక్తులతో నగరంలోని అన్ని ఆలయాలు కిక్కిరిసిపోయాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బోనాల పండుగ సందర్భంగా నగరంలోని ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్(Nidhi Agarwal) సందర్శించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. జులై 24వ తేదీన ఆమె నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల ఉండటంతో అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నిధి.. హీరోయిన్‌గా నటిస్తోంది. ఏఎం రత్నం నిర్మించారు. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. యోధుడు వీరమల్లు పాత్రలో పవన్‌ నటిస్తున్నారు. మొఘల్‌ రాజుల నుంచి కోహినూర్‌ వజ్రాన్ని చేజిక్కించుకోవడంతో పాటు, ప్రేక్షకుల మనసు దోచుకునేందుకు వీరమల్లు సిద్ధమవుతున్నారు. అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని మొదట మార్చి 28న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే, కొన్ని సాంకేతిక కారణాల రీత్యా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జులై 24వ తేదీన ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. నిధి అగర్వాల్ వీడియో

Next Story