- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘనంగా ముదిరాజు ముత్తైదువల బోనాలు: ఊరేగింపులో ఆకట్టుకున్న పోతరాజు విన్యాసం
బోనాల పండగను నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామంలోని ముదిరాజ్ సామాజికవర్గ కుటుంబాలు శనివారం ఘనంగా జరుపుకున్నాయి.

దిశ, భీంగల్: బోనాల పండగను నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామంలోని ముదిరాజ్ సామాజికవర్గ కుటుంబాలు శనివారం ఘనంగా జరుపుకున్నాయి. బోనాల ఊరేగింపులో పాల్గొనేందుకు ముదిరాజ్ ముత్తయిదువలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణలో ప్రధానంగా జరిగే అమ్మవారి పండుగల్లో "బోనాలు" పండగను నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రజలు భక్తి ప్రపత్తులతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి ఏటా జరుపుకునే ఈ పండుగ ఆనవాయితీగా కొనసాగుతోంది. తెలంగాణలో సాధారణంగా ఆషాఢ మాసం (జూన్ చివరి నుంచి జూలై – ఆగస్టు వరకు)లో జరుపుకునే ఈ బోనాల పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. "బోనం" అంటే దేవికి సమర్పించే భోజనం (అన్నం, బెల్లం, పాలు. పెరుగు వంటివి) అని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ సందర్భంగా ముదిరాజ్ పెద్దలు మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యంగా ఉండాలని, ఎలాంటి వ్యాధులు రోగాలు సోకకుండా పిల్లా, జెల్లా, గొడ్డూ, గోజ, పశువులు పంట పొలాలు అన్ని ఆరోగ్యంగా ఉండాలని, అంటువ్యాధులు గ్రామ సరిహద్దులోకి కూడా రాకుండా ఊరి ప్రజలందరినీ కాపాడాలని ఈ బోనాల పండుగ జరుపుతున్నట్లు ముదిరాజ్ సామాజికవర్గ పెద్దలు తెలిపారు.






