తెలంగాణలో బోనాల జాతర ఏర్పాట్లు ముమ్మరం

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-23 12:03:15  IST  )

తెలంగాణ ప్రజలు అత్యంత గ్రాండ్‌గా జరుపుకునే పండుగల్లో బోనాల పండుగ(Bonala Jathara) ఒకటి.

తెలంగాణలో బోనాల జాతర ఏర్పాట్లు ముమ్మరం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలు అత్యంత గ్రాండ్‌గా జరుపుకునే పండుగల్లో బోనాల పండుగ(Bonala Jathara) ఒకటి. ఈ సంవత్సరం బోనాల జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలోనే అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. తాజాగా.. బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని ఉజ్జయినీ మహంకాళి(Ujjain Mahakali) బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. జూలై 13వ తేదీన జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌తో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, అర్చకులు డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా మహంకాళి ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించారు. కాగా, రాష్ట్ర ప్రజలు నెలరోజుల పాటు అంగరంగవైభవంగా జరుపుకొనే బోనాల ఉత్సవాలు ఈనెల 26 నుంచి జరుగుతాయి. ఆ రోజు గోల్కొండ కోటలోని ఎల్లమ్మ(జగదాంబిక) ఆలయంలో ఉత్సవాలు మొదలవుతాయి. జ్యేష్ఠ ఆమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

Next Story