- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు.. పట్టు వస్త్రాలు సమర్పించే ప్రముఖులు వీళ్లే
తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబురం బోనాల పండుగను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబురం బోనాల పండుగను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు జంట నగరాల పరిధిలోని వివిధ ఆలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించే మంత్రులు, ముఖ్య నేతల వివరాలను దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇవాళ వెల్లడించింది. వచ్చే నెల 13న సికింద్రాబాద్ ఉజ్జయిన మహంకాళి ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అనంతరం అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆగస్టు 20న లాల్ దర్వాజలోని సింహవాహిని మహంకాళి ఆలయానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెళ్లి పట్టు వస్త్రాలు అందజేస్తారు. నాచారంలోని మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవస్థానానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్వన్‌లోని దర్బార్ మైసమ్మ ఆలయానికి మంత్రి దామోదర రాజనర్సింహ, చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చిలకలగూడలోని కట్ట మైసమ్మ ఆలయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లి అమ్మవార్లను ప్రభుత్వం తరఫుప పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆగస్టు 1న బల్కంపేటలోని ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ వెళ్లనున్నారు.
అదేవిధంగా వచ్చే నెల 20న సబ్జిమండిలోని నల్లపోచమ్మ ఆలయానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎన్టీఆర్ నగర్‌లోని ఖిలా మైసమ్మ ఆలయానికి మంత్రి సీతక్క, మిరాలం మండిలోని మహంకాళి ఆలయానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, బేలలోని ముత్యాలమ్మ ఆలయానికి మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి, గౌలిపూరలోని మహంకాళి ఆలయానికి మంత్రి వాకిటి శ్రీహరి, సుల్తాన్ షాహీలోని జగదాంబ ఆలయానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గోల్కొండ కోటలోని జగదాంబ మహంకాళి ఆలయానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఉప్పుగూడలోని మహంకాళి ఆలయానికి గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్, బోయిగూడలోని బంగారు మైసమ్మ ఆలయానికి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, హరిబౌలిలోని బంగారు మైసమ్మ ఆలయానికి గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ మేయర్, అంబర్‌పేట్‌లోని మహంకాళి ఆలయానికి బండా ప్రకాష్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్, అలియాబాద్ౠలోని దర్బార్ మైసమ్మ ఆలయానికి డిప్యూటీ స్పీకర్ జాటోథ్ రామచందర్ నాయక్ ప్రభుత్వం తరఫున హాజరై అయా ఆలయాల అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.






