మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు.. కొనసాగుతున్న డాగ్ స్వ్కాడ్ తనిఖీలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-06 03:04:38  IST  )

ఓ వైపు ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) సంక్షోభంతో ప్రయాణికులు సతమతమవుతోన్న నేపథ్యంలో, వరుసగా విమానాలకు బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి.

మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు.. కొనసాగుతున్న డాగ్ స్వ్కాడ్ తనిఖీలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వైపు ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) సంక్షోభంతో ప్రయాణికులు సతమతమవుతోన్న నేపథ్యంలో, వరుసగా విమానాలకు బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. తాజాగా ఇవాళ ఉదయం మరో రెండు విమానాల్లో బాంబు ఉందంటూ ఆగంతకులు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Shamshabad International Airport) సిబ్బందికి మెయిల్ పంపారు. అందులో కువైట్-హైదరాబాద్ (KU-373) ఫ్లైట్, బ్రిటిష్ ఎయిర్‌వేస్ (BA 277) విమానం ఉన్నాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బంది సలహా మేరకు కువైట్-హైదరాబాద్ (Kuwait-Hyderabad) విమానాన్ని పైలట్లు హుటాహుటిన మస్కట్‌కు మళ్లించారు. ఇక బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం విమానంలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది బాంబ్ స్క్వాడ్‌తో కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీనూ చెక్ చేస్తూ వెళ్తున్నారు.

Next Story