- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ హైకోర్టుకు బాంబు బెదిరింపులు.. తనిఖీ చేస్తున్న బాంబ్ స్క్వాడ్
తెలంగాణ హైకోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది. కోర్టు ప్రాంగణంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు, భద్రతను కట్టుదిట్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు (High Court)లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి హైకోర్టును పేల్చివేస్తామంటూ బాంబు బెదిరింపులు రావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ (BDS), డాగ్ స్క్వాడ్‌తో హుటాహుటిన హైకోర్టుకు చేరుకున్నారు. కోర్టు ప్రాంగణంలో అనుమానం వచ్చిన ప్రతి వస్తువును క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యగా కోర్టు సిబ్బందిని, న్యాయవాదులను భద్రతా సిబ్బంది అప్రమత్తం చేశారు. న్యాయమూర్తుల ఛాంబర్లు, కోర్టు హాళ్లు, రిజిస్ట్రీ కార్యాలయంతో పాటు పార్కింగ్ ఏరియాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. తనిఖీలు పూర్తయ్యే వరకు ఎవరూ లోపలికి రావొద్దని అధికారులు సూచించారు. అవాంఛనీయ ఘటనలు, చోటచేసుకోకుండా హైకోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.






