Flash: తెలంగాణ హైకోర్టుకు బాంబు బెదిరింపులు

by Naga Rani Yarlagadda |

తెలంగాణ హైకోర్టు, నాంపల్లి సీబీఐ కోర్టు, ఏపీలో విశాఖ జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Flash: తెలంగాణ హైకోర్టుకు బాంబు బెదిరింపులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో తెలుగురాష్ట్రాల్లో కోర్టులకు పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చిన ప్రతిసారి పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు చేయగా.. అవన్నీ ఫేక్ అని తేలింది. తాజాగా తెలంగాణ హైకోర్టు, నాంపల్లి సీబీఐ కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. దీంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అప్రమత్తమై సిబ్బందిని ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఏపీలోని విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ స్పాట్ కు చేరుకున్నాయి. కోర్టు ఆరవణలో ఉన్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి.

Next Story