లుఫ్తాన్సా ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. హుటాహుటిన దారి మళ్లింపు

by Kema Shiva Kumar |

దేశ వ్యాప్తంగా వరుసగా హెలికాప్టర్, విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్న తరుణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

లుఫ్తాన్సా ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. హుటాహుటిన దారి మళ్లింపు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా వరుసగా హెలికాప్టర్, విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్న తరుణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాసేపటి క్రితం ఓ విమానానికి ఆగంతకుల నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జర్మనీ (Germany)లోని ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్టు (Frankfurt Airport) నుంచి శంషాబాద్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ (Lufthansa Airlines) LH 752 విమానానికి మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఫ్లైట్ సిబ్బంది హుటాహుటిన ఫ్రాంక్‌ఫర్ట్ ఏటీసీకి సమాచారం అందజేశారు. వారి ఆదేశాల మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన లుఫ్తాన్స్ ఫ్లైట్ తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయింది. ఈ మేరకు ఫ్రాంక్‌ఫర్ట్ ఏటీసీ అదే సమాచారాన్ని శంషాబాద్ ఏటీసీకి అందజేసింది.

Next Story