- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. రంగంలోకి దిగిన టీఎస్‌పీఎఫ్, CISF
బెగంపేట్ (Begumpet) విమానాశ్రయానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సిబ్బందికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బేగంపేట్ (Begumpet) విమానాశ్రయానికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి సిబ్బందికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇవాళ ఉదయం 11.10 ప్రాంతంలో ఆగంతకుడు ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ మెయిల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన బేగంపేట్ ఎయిర్‌పోర్టు అధికారులు భద్రతా సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సీఐఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ముందుగా ఎయిర్‌పోర్టులో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది బయటకు పంపించేశారు. ఎయిర్‌పోర్టు లోపల, పరిసర ప్రాంతాల్లో స్నిఫ్ఫర్ డాగ్స్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. మెయిల్ పంపింది ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
Next Story






