హైదరాబాద్‌ విమానానికి బాంబ్‌ బెదిరింపు

by Gantepaka Srikanth |

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబ్ బెదిరింపు మెయిల్ రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం సింగపూర్‌ - హైదరాబాద్‌ విమానంలో బాంబు పెట్టినట్లు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

హైదరాబాద్‌ విమానానికి బాంబ్‌ బెదిరింపు
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(Shamshabad Airport) మరోసారి బాంబ్ బెదిరింపు మెయిల్ రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం సింగపూర్‌ - హైదరాబాద్‌ విమానం(Singapore - Hyderabad Flight)లో బాంబు పెట్టినట్లు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయ్యాక ప్రయాణికులను దింపేసి, విమానంలో తనిఖీలు చేపట్టారు. ఎక్కడ బాంబ్ లభ్యం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ నుంచి నేటి వరకు అంటే రెండు నెలల వ్యవధిలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 23 నకిలీ బెదిరింపు కాల్స్‌ వచ్చాయని అధికారులు వివరించారు. ఈ తరహా ఘటనలకు పాల్పడిన పలువురిని ఇప్పటికే గుర్తించి.. పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరికొంత మంది విదేశాల నుంచి ఈ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో బహిర్గతం కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు షురూ చేశారు.

Next Story