శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. వారంలో రెండో సారి మెయిల్.. అధికారులు అలర్ట్

by Ramesh Naini |   (  Updated:2025-05-15 08:24:36  IST  )

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. వారంలో రెండో సారి మెయిల్.. అధికారులు అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో/ దిశ, శంషాబాద్ : హైదరాబాద్‌లోని (Shamshabad Airport) శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. గురువారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చివేస్తామంటూ అగంతకులు శంషాబాద్ విమానాశ్రయ కార్యాలయానికి మెయిల్ పంపారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఎయిర్‌పోర్టు పోలీసులు, సీఐఎస్ఎఫ్ బలగాలు, విమానాశ్రయంలోని డిపార్చర్, అరైవల్, పార్కింగ్, రన్వే, ప్రయాణికుల లగేజ్‌తో పాటు తదితర ప్రాంతాలలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. విమానాశ్రయంలో ఎక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానితులు కనిపించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వచ్చిన మెయిల్ ఐర్లాండ్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మెయిల్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇటీవల వారం క్రితం శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు పెట్టారంటూ అధికారులకు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ తరుచుగా బాంబు బెదిరింపుల మెయిల్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

Next Story