- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
B. Vinod Kumar : కేసీఆర్ పై బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) పై బోయినపల్లి వినోద్ కుమార్(Boinapally Vinod Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) పై బోయినపల్లి వినోద్ కుమార్(Boinapally Vinod Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ (Congress) పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని.. కేంద్రం ప్రభుత్వంలోని వివిధ సంస్థలు లెక్కలతో సహా మన అభివృద్ధిని అభినందిస్తూ అవార్డులు అందించాయని గుర్తుచేశారు. కానీ తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని అన్నారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే నూతన కార్యవర్గ మొదటి సమావేశానికి వర్చువల్ గా హాజరైన వినోద్‌కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో అరాచక పాలనను కొనసాగిస్తుందని ఆరోపించారు. బాధ్యత గల బీఆర్‌ఎస్ కార్యకర్తలుగా ప్రజల పక్షాన నిలబడి సోషల్‌మీడియా వేదికగా, అలాగే లండన్‌లో ప్రత్యేక నిరసన కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్‌ను నిలదీయాలని ఎన్‌ఆర్‌ఐ కార్యకర్తలకు సూచించారు.






