13 రోజుల క్రితం గల్లంతైన రామ మృతదేహం లభ్యం

by Malleboina Mahesh |

ఈ నెల 14న ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో పలువురు వరదలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.

13 రోజుల క్రితం గల్లంతైన రామ మృతదేహం లభ్యం
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 14న ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో పలువురు వరదలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వారి ఆచూకీ కోసం హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు నేటికి గాలిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా గురువారం రాత్రి నుంచి నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో 13 రోజులు క్రితం హైదరాబాద్ – హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్‌నగర్ ప్రాంతంలో మామ, అల్లుడు అర్జున్, రామ కొట్టుకుపోయారు. కాగా ఈ రోజు ఉదయం నాగోల్ మూసీ లో గుర్తు తెలియని మృతదేహం ఉందని పోలీసులకు స్థానికులు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి ఈ నెల 14వ తేదీన కొట్టుకుపోయిన రామగా గుర్తించారు. అనంతరం ఆ మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఒకేసారి మామ అల్లుడు వరదలో కొట్టుకుపోగా.. అర్జున్ మృతదేహం 75 కి.మీ దూరంలోని వలిగొండలో లభించిన విషయం తెలిసిందే.

Next Story