కృష్ణానదిలో లాంచీ ప్రయాణం.. ఒకేసారి 120 మంది ప్రయాణించేలా..

by Naga Rani Yarlagadda |

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో లాంచీ ప్రయాణాన్ని పర్యాటక శాఖ తిరిగి అందుబాటులోకి తీసుకురానుంది.

కృష్ణానదిలో లాంచీ ప్రయాణం.. ఒకేసారి 120 మంది ప్రయాణించేలా..
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో లాంచీ ప్రయాణాన్ని పర్యాటక శాఖ తిరిగి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నెల 19 నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒకేసారి 120 మంది ప్రయాణించేలా డబుల్ డెక్కర్ ఏసీ లాంచీలు, మినీ లాంచీలు, స్పీడ్ బోట్లను సిద్ధం చేసింది. ఇప్పటికే ట్రయల్ రన్స్ పూర్తి చేయగా.. కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గడంతో, పర్యాటకుల కోసం పడవ ప్రయాణాన్ని పునరుద్ధరిస్తున్నారు. అయితే ఈ ప్యాకేజీల్లో భాగంగా పెద్దలకు రూ. 2000, చిన్న పిల్లలకు రూ.1600 టికెట్ ధరగా నిర్ణయించారు. ఈ ప్రయాణం పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తుందని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. సుందరమైన నల్లమల అడవుల గుండా ప్రయాణిస్తూ, కృష్ణమ్మ పరవళ్లను పర్యాటకులు సుమారు ఏడు గంటలపాటు ఆస్వాదించవచ్చని చెబుతున్నారు. శ్రీశైలం దేవస్థానాన్ని సందర్శించాలనుకునే భక్తులకు, ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రయాణం ఒక అద్భుతమైన అవకాశంగా ఉండనుంది.

Next Story