- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా మారుస్తూ బోర్డు ఏర్పాటు.. ఇరువైపులా కమాన్ కూడా..
తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్(Telangana Thalli Flyover)గా ఇటీవల జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్(Telangana Thalli Flyover)గా ఇటీవల జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా మారుస్తూ బోర్డు ఏర్పాటు ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ఫ్లైఓవర్‌కు ఇరువైపులా జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు కమాన్ ఏర్పాటు చేశారు. కాగా, 1997లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. సచివాలయం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ రహదారి ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం నిర్మించారు. అప్పుడే దీనికి “తెలుగు తల్లి ఫ్లైఓవర్”గా నామకరణం చేశారు. ఈ వంతెన అశోక్‌నగర్, ఇందిరానగర్ ప్రాంతాలను సికింద్రాబాద్‌తో అనుసంధానించడంలో కీలకంగా మారింది. లిబర్టీ నుంచి సచివాలయానికి వెళ్ళే వాహనదారుల రద్దీ తగ్గింది. తెలంగాణ ఏర్పాటుతో తాజాగా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ దీనిని ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్’గా మార్చేందుకు నిర్ణయించింది.






