సింగరేణి బొగ్గు గనిలో భారీ పేలుడు.. పలువురికి గాయాలు

by Ajay Maddhiboyina |

సింగ‌రేణి బొగ్గు గ‌నిలో భారీ పేలుడు సంభ‌వించ‌డంతో చుట్టు పక్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు గాయ‌ప‌డ్డారు.పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఓసీ2 బొగ్గు గనిలో భారీ పేలుడు చోటు చేసుకుంది.

సింగరేణి బొగ్గు గనిలో భారీ పేలుడు.. పలువురికి గాయాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: సింగ‌రేణి బొగ్గు గ‌నిలో భారీ పేలుడు సంభ‌వించ‌డంతో చుట్టు పక్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు గాయ‌ప‌డ్డారు.పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఓసీ2 బొగ్గు గనిలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు కార‌ణంగా చుట్టు పక్కల ఉన్న నాగేపల్లి, లద్నాపూర్, ఆదివారం పేట, రాజాపూర్, పన్నూరు గ్రామాల్లో భూమి కంపించి కొన్ని ఇండ్లు ధ్వంసమ‌య్యాయి. ఇండ్లపై రాళ్లు ఎగిరిపడి పలువురు ప్ర‌జ‌లు గాప‌డ్డారు. ఓ వ్య‌క్తి చేతికి రాయి త‌గ‌ల‌టంతో తీవ్ర‌గాయం అవ్వ‌డంతో పాటూ ర‌క్త‌స్రావం జరిగింది. పెద్ద‌వారితో పాటూ మ‌హిళ‌లు చిన్నపిల్ల‌లు సైతం బాంబ్ బ్లాస్ట్ కార‌ణంగా గాయ‌ప‌డ్డారు. బాంబు తీవ్ర‌త‌కు ఇనుప రాడ్లు సైతం విరిగిపోయాయి. దీంతో వెంట‌నే బ్లాస్టింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని, బాధితులకు నష్ట పరిహారం అందజేయాలని గ్రామస్థులు ధ‌ర్నా చేప‌ట్టారు.

Next Story