షాకింగ్.. సర్పంచ్ ఎన్నికల్లో గెలవాలని అభ్యర్థి ఇంటిముందు క్షుద్రపూజలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-16 07:40:15  IST  )

స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు అభ్య‌ర్థులు ఎంత దూరం అయినా వెళుతున్నారు. ఎన్నిక‌ల్లో గెలిచేందుకు డ‌బ్బు, మ‌ద్యం పంచ‌డంతో పాటు తేడా వ‌స్తే ప్ర‌త్య‌ర్థుల‌పై దాడుల‌కు సైతం పాల్ప‌డుతున్నారు.

షాకింగ్.. సర్పంచ్ ఎన్నికల్లో గెలవాలని అభ్యర్థి ఇంటిముందు క్షుద్రపూజలు
X

దిశ‌, వెబ్ డెస్క్/ దిశ, మక్తల్: స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు అభ్య‌ర్థులు ఎంత దూరం అయినా వెళుతున్నారు. ఎన్నిక‌ల్లో గెలిచేందుకు డ‌బ్బు, మ‌ద్యం పంచ‌డంతో పాటు తేడా వ‌స్తే ప్ర‌త్య‌ర్థుల‌పై దాడుల‌కు సైతం పాల్ప‌డుతున్నారు. ఇక తాజాగా నారాయ‌ణ‌పేట జిల్లా మ‌క్త‌ల్ మండ‌లం కార్ వాచ్ గ్రామంలో వింత ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఎన్నిక‌ల్లో గెలిచేందుకు త‌మ ఇంటి ముందు క్షుద్ర‌పూజ‌లు చేశార‌ని బీఆర్ఎస్ అభ్య‌ర్థి వెంక‌ట‌మ్మ ఆరోపించారు. ఇంటి ముందు తెల్ల అవాలు, చ‌నిపోయిన త‌ర‌వాత మృత‌దేహాల‌పైచ‌ల్లే స్ప్రే, మొల‌కెత్తిన గింజ‌లు, ఇసుక చ‌ల్లారని చెప్పారు. త‌మ ఇంటిముందే కాకుండా త‌మ‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నవారి ఇంటి ముందు కూడా ఇలానే క్షుద్ర‌పూజ‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు.

ఏమైనా ఉంటే ప్ర‌జాక్షేత్రంలో తేల్చుకోవాల‌ని కానీ ఇలాంటి ప‌నులు చేయ‌వ‌ద్ద‌ని అన్నారు. త‌మ‌కు ఏమైనా జ‌రిగితే త‌మ‌పై పోటీ చేసిన అభ్య‌ర్థిదే బాధ్య‌త అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక కాచువార్ గ్రామంలో సర్పంచ్ పదవికి బీసీ మహిళ రిజర్వేషన్ కేటాయించబడింది. అయితే బరిలో నిలిచిన మహిళ అభ్యర్థి మమానే ఈ పనిచేసినట్టు ఒప్పుకున్నాడు. తన కోడలు గెలుపుకోసమే ఇలా చేశానని గ్రామస్తుల ముందు చెప్పాడు. మరోవైపు ప్రత్యర్థి భర్త ఇప్పటికే తనకు గుండె నొప్పి వస్తుందంటూ అంబులెన్స్ లో మక్తల్ ఆస్పత్రికి వెళ్లాడు. మెరుగైన వైద్యం కోసం అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన గ్రామంలో కలకలం రేపుతోంది. దీంతో ప్రచారంలో అభ్యర్థివైపు చూసేందుకు ప్రజలు భయపడుతున్నారు. మామ చేసిన పనితో కోడలు పంచుతున్న వాటిని కూడా తీసుకుంనేందుకు వణికిపోతున్నారు. ఇక బుధవారం ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story