ఓటీపీ రాజకీయాలు సాగవు.. కేసీఆర్ సమావేశంపై బీజేపీ రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

తెలంగాణలో వన్ టైం పాస్‌వర్డ్ లాగా ఓటీపీ రాజకీయాలు సాగవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఓటీపీ రాజకీయాలు సాగవు.. కేసీఆర్ సమావేశంపై బీజేపీ రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వన్ టైం పాస్‌వర్డ్ లాగా ఓటీపీ రాజకీయాలు సాగవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంపై ఆయన స్పందించారు. కొన్ని నెలల తర్వాత కేసీఆర్ బయటకొచ్చారని విమర్శించారు. రాజకీయాల్లో ఏదైనా మార్పు ఉండొచ్చని అంటున్నారు.. కానీ ఏమీ మారదన్నారు. కేసీఆర్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అని రామచందర్ రావు చెప్పుకొచ్చారు.

అలాగే రాబోయే బడ్జెట్ సమావేశాల్లో హేట్ స్పీచ్ బిల్లు తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. కేవలం బీజేపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధించడానికే కర్ణాటక తరహాలో ఈ బిల్లు తీసుకురావాలని చూస్తున్నారని అన్నారు. కేవలం హిందువులను తిట్టే వారిని కాపాడటానికి, హిందువులను మాట్లాడకుండా చేయడానికే ఈ బిల్లు తీసుకురావాలని అనుకుంటున్నారని ఆరోపించారు.

Next Story