- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
66 మోసాలపై రేపే బీజేపీ బహిరంగ సభ.. కీలక ప్రకటన చేసిన నేత
కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో 6 అబద్దాలు 66 మోసాలను చర్చించుకోవడానికి బీజేపీ నాయకులు బహిరంగా సభ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో 6 అబద్దాలు 66 మోసాలను చర్చించుకోవడానికి బీజేపీ నాయకులు బహిరంగా సభ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన వైఫల్యాలను గుర్తు చేస్తూ కులంకషంగా వివరించుకోవాలని సరూర్ నగర్ స్టేడియం మైదానం(ఎల్.బి.నగర్)లో ఈనెల 7న మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ బహిరంగా సభకు ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పాల్గొననున్నారని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. ఈ సభకుకేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యులు డీకే అరుణ, డాక్టర్ కే లక్ష్మణ్, మహేశ్వర్ రెడ్డి, ఏవీయన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొననున్నట్టు ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.






