- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP: ట్రోల్ చేస్తే తాట తీస్తా.. తొలి స్పీచ్ లోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు బీజేపీ నూతన అధ్యక్షుడు వార్నింగ్
బీజేపీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: బీజేపీలో కొత్త, పాత అనే తేడా లేదని బిడ్డ పుట్టగానే కుటుంబ సభ్యులు అయినట్టు, పార్టీలో చేరగానే వారంతా పార్టీ కుటుంబ సభ్యులేనని తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు (BJP New President) ఎన్.రామచందర్ రావు (Ramachander Rao) అన్నారు. బీజేపీలో కొత్త, పాత అనే పంచాయతీ లేదని నది ప్రవహించాలంటే కొత్త నీరు రావాల్సిందేనన్నారు. ఇవాళ మన్నెగూడలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్.రామచందర్ రావు ఎన్నికైనట్లు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కేంద్ర మంత్రి శోభాకరంద్లాజే (Shobhakarandlaje) అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు రామచందర్ రావుకు నియామక పత్రం అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) నుంచి నూతన అధ్యక్షుడు రామచందర్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ.. నేను పేరుకే అధ్యక్షుడినని కానీ నేనెప్పటికీ కార్యకర్తను, మీ సేవకుడినే అన్నారు. కార్యకర్తలే ఈ పార్టీకి నిజమైన సారథులని చెప్పారు. బీజేపీ ఈ స్థాయికి వచ్చిందంటే ఎంతో మంది కార్యకర్తల, నాయకులు త్యాగాలున్నాయని మీ చెమట కష్టంతోనే బీజేపీ ఎదిగిందన్నారు. అందరి ఆశీస్సులతో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడం గర్వంగా ఉందని ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. నక్సలైట్ల తూటాలకు బలైన బీజేపీ నాయకుల బలిదానాలవల్లే పార్టీ ఈ స్థాయికి ఎదిగింది. నేనూ నక్సలైట్ బాధితుడిని అన్నారు.
ట్రోల్ చేస్తే జైళ్లో పెట్టిస్తా:
బీజేపీ మాస్ క్యాడర్ పార్టీ అని సిద్ధాంత బలమున్న పార్టీ అన్నారు. కలిసికట్టుగా గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ యువత రాజకీయాల్లోకి రావాల్సిందే యువకులుల, మహిళలు బీజేపీలోకి రావాలని, 33 శాతం రిజర్వేషన్ల అమలుతో మహిళలకు ఎన్నో అవకాశాలు రాబోతున్నాయన్నారు. తెలంగాణ ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారు. పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వాట్సాప్ వర్శిటీలను పెట్టుకుని ఫేక్ న్యూస్ ను ట్రోలింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు దమ్ముంటే నేరుగా ఎదురుగా పోరాడదాం రండి. కానీ మీరు దమ్ములేని పిరికిపందలు కాబట్టే వెనుకుండి ఫేక్ న్యూస్ ట్రోల్ చేస్తున్నారని దుయ్యబట్టారు. నేను క్రిమినల్ లాయర్ ను ఫేక్ న్యూస్ సూత్రధారులను బోనులో నిలబెట్టేందుకూ వెనుకాడనన్నారు. రామచంద్రరావు సౌమ్యుడే కానీ యుద్దంలోకి దిగితే యోధుడినే అన్నారు. ఏబీవీపీగా ఉన్నప్పుడే జైలుకు వెళ్లొచ్చినోడిని. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నోడిని. కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నా సిద్ధాంతాన్ని వీడకుండా పనిచేసినోడిని అన్నారు. విద్యార్థులు, న్యాయవాదులతో, పేదల పక్షాన న్యాయ పోరాటం చేశాసననని ఇకపై తెలంగాణ ప్రజల పక్షాన అలుపెరగని పోరాటాలకు సిద్ధంగా ఉన్నానన్నారు. కలిసికట్టుగా అందరితో కలిసి పనిచేస్తానని బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని చెప్పారు.






