- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండో విడత ఓట్ల లెక్కింపు.. ఆ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను మించి బీజేపీ హవా
తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Counting of votes in local body elections) ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలుబడ్డ పలితాల్లో అధికార కాంగ్రెస్ సత్తా చాటుతుండగా.. కొన్ని జిల్లాల్లో.. బీజేపీ, బీఆర్ఎస్ ఇతరులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లా (Nirmal District)లో అధికార పార్టీకి షాక్ ఇచ్చిన బీజేపీ అత్యధికంగా సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుటుంది. మొత్తం ఆ జిల్లాలో మొత్తం 130 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఇప్పటి వరకు వెలుబడ్డ పలితాల్లో బీజేపీ 26 స్థానాల్లో విజయం సాధించింది. అధికార కాంగ్రెస్ 19 స్థానల్లో ఉండగా బీఆర్ఎస్ కేవలం 2 స్థానలను మాత్రమే గెలుచుకుంది. అలాగే స్వతంత్రులు 17 స్థానాల్లో విజయం సాధించి అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నడుస్తోంది. మొత్తం 156 సర్పంచ్ స్థానాలు ఉండగా.. ఇప్పటి వరకు కాంగ్రెస్ 28 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 20 స్థానాలు గెలుచుకొని అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది. ఈ రెండో విడతలో బీజేపీ ఊహించిన స్థాయిలో మంచి ఫలితాలను రాబడుతున్నట్లు తాజా ట్రెండ్ ను చూస్తు అర్ధమవుతుండగా.. ఇప్పటి వరకు బీజేపీ 92 సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది.






