- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీలో ముదురుతోన్న అంతర్గత పోరు.. కమలదళం చీలిందా?
బీజేపీలో అంతర్గత పోరు నానాటికీ ముదురుతోంది. ఆధిపత్య పోరులో ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు కొందరు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీలో అంతర్గత పోరు నానాటికీ ముదురుతోంది. ఆధిపత్య పోరులో ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు కొందరు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే పార్టీ పరువు, ప్రతిష్ఠను రోడ్డుకు ఈడుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థులను అణిచివేయడమే లక్ష్యంగా దుష్పప్రచారం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే బీజేపీ పార్టీ ట్యాగ్ లైన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలకనేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు కారణంగా కేడర్తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పార్టీకి మైలేజ్ వస్తున్న క్రమంలో నేతల తీరు వలన నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నాయకత్వం ఇక్కడి పరిస్థితిపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించేలా చూడాలని కేడర్ కోరుతోంది.
ఈటల రాజేందరే టార్గెట్..
బీజేపీలో గత కొంతకాలంగా పాత, కొత్త వివాదం రాజుకుంది. పార్టీలోని కొందరు తాజాగా ఎంపీ ఈటల రాజేందర్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తూ పోస్టర్లు వేశారు. ఇది కేంద్రమంత్రి బండి సంజయ్వర్గానికి చెందిన కొందరి పని అంటూ ఈటల అనుచరులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ఎంపీ అర్వింద్, ఈటల కొంతకాలంగా సాన్నిహిత్యంగా ఉంటున్నారని.. దీంతో వారిని లక్ష్యంగా చేసుకొని వారిమధ్య గ్యాప్ వచ్చేలా పోస్టర్‌ను ముద్రించారని ఈటల అనుచరులు ఆరోపిస్తున్నారు. అయితే, బండి సంజయ్ కొడుకు భగీరథ్ మీద పోక్సో కేసు కావడంతో కేంద్రమంత్రి, ఈటల, అర్వింద్ మధ్య వివాదం మరింత ముదరిందని పార్టీ నాయకులు చెబుతున్నారు. బండి రాష్ట్ర అధ్యక్షుడిగా దిగిపోవడానికి పరోక్షంగా ఈటల, ఇతర నేతలు కారణమంటూ బండి అనుచరులు ఆరోపిస్తున్నారు. సంజయ్ కొడుకు వివాదం బయటకు రావడంలో ఈటల, అర్వింద్ హస్తముందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ముగ్గురు నేతల మీద బహిరంగంగానే సోషల్‌మీడియాలో పరస్పర పోస్టులు, విమర్శలు వైరల్ అవుతున్నాయి.
పోస్టర్‌లో ఏముంది?
‘ఈటల ఏడుపే బీజేపీకి శాపం..! రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు... కేంద్రమంత్రి పదవి రాలేదని ఏడుపు. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ. ఓడిపోయినా మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ. మోడీ నాయకత్వంలో గెలిచినా.. నా ఇమేజ్‌తోనే గెలిచాను అనడం ఇదేం రాజకీయ నైతికత. బీసీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు? ఇందూరు బిడ్డ ఎంపీ అర్వింద్‌కు వస్తున్న ఆదరణ చూసి కడుపుమంట ఎందుకు? నేనే బీసీ నాయకుడిని.. నేనే ప్రత్యామ్నాయం.. అనే భ్రమ నుంచి బయటకు రా ఈటల. బీజేపీ నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది’ అంటూ ఆ పోస్టర్‌లో రాసుకొచ్చారు.
కేంద్రమంత్రి పదవిపై ఆశలు..
బండిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే క్రమంలో తమకు పదవి వస్తుందని ఎంపీలు ఈటల, అర్వింద్, డీకే అరుణ తదితరులు భావించారు. తీరా బండికి చాన్స్ దక్కడంతో వారంతా నిరాశ చెందారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం వారంతా ఎదురుచూశారు. కానీ, సాధ్యం కాలేదు. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టాక్. రాజ్యసభ ఎన్నికల అనంతరం ఈనెలాఖరున లేదా వచ్చేనెల మొదటి వారంలో విస్తరణ ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరొకరికి కేంద్రమంత్రి పదవి వచ్చే చాన్స్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎంపీలు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా కోటాలో డీకే అరుణ, ఎస్టీ కోటాలో నగేశ్, బీసీ కోటాలో లక్ష్మణ్, ఈటల, అర్వింద్‌లు ఉన్నారు. ఈ క్రమంలోనే గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య పోరు పెరిగిందని పార్టీలో చర్చ జరుగుతోంది.
బీజేఎల్పీ నేతల ఖండన
ఈటలకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసిన నేపథ్యంలో బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డితో పాటుగా మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రకటన విడుదల చేశారు. పోస్టర్ల వివాదాన్ని ఖండించారు. ఎంపీ ఈటలను కించపరిచేలా ఏర్పాటు చేసిన బ్యానర్లను రాష్ట్ర బీజేపీ నేతలు, కార్యకర్తలు ముక్తకంఠంతో ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇది ఒక నాయకుడిపై వ్యక్తిగత దాడి మాత్రమే కాదని, తెలంగాణ బీజేపీ ఎదుగుదలను చూసి భయపడుతున్న ప్రత్యర్థి రాజకీయ శక్తుల అసురక్షిత భావానికి నిదర్శనమని వివరించారు. ఈటల దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకుడని, ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తిని కించపరిచేలా నీచ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు ఐక్యం ఉండి కుట్రలను తిప్పికొడతామని పేర్కొన్నారు.






